రూ.950 కోట్లు ఔట్.. మరో రెండు రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'!
on Sep 23, 2023
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్' బాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తోంది. మరో రెండు రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ శుక్రవారంతో 16 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. శుక్రవారం నాడు దాదాపు రూ.17 కోట్ల గ్రాస్ రాబట్టిన జవాన్.. 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.953.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈరోజు, రేపు వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల్లో సులభంగా మరో రూ.40-50 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది. అదే జరిగితే సోమవారం నాటికి జవాన్ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరినట్టే.
ఏరియాల వారిగా 'జవాన్' 16 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తెలుగు రాష్ట్రాలు: రూ.55.10 కోట్ల గ్రాస్
తమిళనాడు : రూ.45.10 కోట్ల గ్రాస్
కర్ణాటక: రూ.48.85 కోట్ల గ్రాస్
కేరళ: రూ.13.30 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ.479.50 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ.312.05 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల కలెక్షన్స్: రూ.953.90 కోట్ల గ్రాస్
హిందీ వెర్షన్ 16 రోజుల నెట్: రూ.480.54 కోట్లు

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
